Tuesday, March 10, 2020

బ్రిటన్ వైద్యారోగ్య జూనియర్ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా పాజిటివ్ వైరస్

బ్రిటన్ వైద్యారోగ్య జూనియర్ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా పాజిటివ్ వైరస్ సోకడంతో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని డోరిస్ తెలిపారు. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. తన ఇంటిలోనే ఐసోలేషన్ వార్డులో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఆరోగ్య, తన పార్లమెంటరీ కార్యాలయ సిబ్బంది సలహాతో నడుచుకుంటున్నానని ప్రకటనలో డోరీస్ పేర్కొన్నారు. డోరీస్‌కు కరోనా వైరస్ సోకిందని మంగళవారం నిర్ధారణ కాగా.. ఆమె అంతకుముందే పార్లమెంట్ సమావేశంలో వేలాదిమంది ప్రజలను కలుసుకొన్నారని 'టైమ్స్' రిపోర్ట్ చేసింది. అంతేకాదు గతవారం జరిగిన ఒక విందులో ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కూడా సమావేశమయ్యారు. దీంతో ప్రజలు, ప్రధానికి కూడా వైరస్ సోకిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. డోరిస్‌కు కరోనా పాజిటివ్ సోకడం బాధాకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి మాట్ హన్‌కాక్ ట్వీట్ చేశారు. వైరస్ సోకిన వెంటనే తాను సెల్ఫ్ ఐసోలేటెడ్ వార్డులో ఇంటిలో ఉండటం మంచి చర్య అని అభివర్ణించారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అదేవిధంగా కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య 319 నుంచి 373కి చేరిందని వివరించింది.

SHARE THIS

Author:

0 comments: