Wednesday, July 15, 2020

Tuesday, March 10, 2020

అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ ప్రారంభ సన్నాహక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ ప్రారంభ సన్నాహక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

అమెరికా సంయుక్త రాష్ట్రాలు , భారతదేశాలు మంచి సంభందాలు కలిగుండటం ప్రపంచానికే మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్అన్నారు . ఇందు కోసం మన ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నూతనంగా నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ ప్రారంభ సన్నాహక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యాలయాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో అమెరికా రాయబారి కేన్నత్‌ జస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.
టిడిపి నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న వైసీపీ : చంద్రబాబు

టిడిపి నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న వైసీపీ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఉండేందుకు వారికి అవసరమైన సర్టిఫికెట్లు జారీ కాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కావేటివారిపల్లిలో ఇంటి పన్ను కట్టించుకోవడానికి ఎండీవో నిరాకరించారని, గుంటూరు జిల్లాలో గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకుండా పోయారని చంద్రబాబు చెప్పారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బాదూరులో నామినేషన్‌ వేయడానికి వస్తున్న టీడీపీ నేతలపై దాడి చేసి కొట్టారని, గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లిలో కూడా నామినేషన్‌కు వస్తున్న టీడీపీ వారిపై దాడి జరిగిందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో రాత్రి సమయంలో టీడీపీ నేత ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి.. టీడీపీ వారిపైనే ఎదురు కేసు పెడితే సీఐ భక్తవత్సలరెడ్డి వెంటనే 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బు, మద్యం పంచబోరని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ఈ 15 రోజులూ మద్యం షాపులను పూర్తిగా మూసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఒకరిపై దాడిచేస్తే వంద సీట్లలో ఓడించాలని.. అప్పుడే భయం వస్తుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు, ప్రభుత్వ ప్రచార హోర్డింగులను తక్షణం తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వీటిని తొలగించకపోతే తానే స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తి చూపుతానని ప్రకటించారు.
ఆంధ్రప్రదెశ్ స్థానిక సంస్థల ఎన్నికలక సమయంలో వైసీపీలోకి పెరిగిన వలసలు

ఆంధ్రప్రదెశ్ స్థానిక సంస్థల ఎన్నికలక సమయంలో వైసీపీలోకి పెరిగిన వలసలు

ఆంధ్రప్రదెశ్ స్థానిక సంస్థల ఎన్నికలక సమయంలో వైసీపీలోకి వలసలు . వివిధ పార్టీలకు చెందిన మాజీ నేతలు గంపగుత్తగా వైసీపీ లో కి చేరుతున్నారు . మంగళవారం ఒక్కరోజే సుమారు పదిమంది వైసీపీలో చేరారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పలువురు నేతలు వైసీపీలోకి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాజ్యసభ మాజీ సభ్యుడు సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో కలిసి వచ్చారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబూరావుకి కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతోనే ఇంతకాలం టీడీపీలో కొనసాగానని బాబూరావు చెప్పారు. విశాఖపట్నంలో కాంగ్రెస్‌ నుంచి వైసీపీకి వెళ్లి అక్కడ నుంచి టీడీపీకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ తిరిగి వైసీపీ గూటికి చేరారు. ప్రజారాజ్యం నుంచి గాజువాక ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతలపూడి వెంకట్రామయ్య గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పెందుర్తి నుంచి పోటీ చేశారు. ఆయన తాజా పరిణామాల్లో వైసీపీలో చేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పసుపులేటి బాలరాజు గత ఎన్నికల్లో జనసేన పార్టీలోకి వెళ్లారు. తాజాగా ఆయన వైసీపీలో చేరారు. వీరంతా విశాఖ పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
హైదరాబాద్ మెట్రోకీ మూడు జాతీయ అవార్డులు

హైదరాబాద్ మెట్రోకీ మూడు జాతీయ అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్  ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు ,  ప్రయాణికుల మన్నన కలిగి  మూడు జాతీయ అవార్డులు లభించాయి. బెంగుళూరులో ఇటీవల నిర్వహించిన పీఆర్‌సీఐ గ్లోబల్‌ కమ్యునికేషన్స్‌ సదస్సు సందర్భంగా ఎల్‌ అండీ మెట్రో కార్పొరేట్‌ కమ్యునికేషన్స్‌ హెడ్‌ అనిందితా సిన్హా పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీఆర్‌సీఐ)కు చెందిన ఈ అవార్డులను అందుకున్నట్టు మెట్రోరైలు అధికారులు తెలిపారు.
మారుతీ సుజుకీ బిఎస్‌6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్ల ఆఫర్లు

మారుతీ సుజుకీ బిఎస్‌6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్ల ఆఫర్లు

మారుతీ సుజుకీ బిఎస్‌6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్ల ఆఫర్లు , ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీతెలిపింది . ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన వాహనాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అనేక కార్లు, టూవీలర్‌ తయారీ కంపెనీలు బీఎస్‌4 వాహనాలపై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను అందిస్తుంటే.. మారుతి బిస్‌6 వాటిపై అందించడం ఆసక్తి రేపుతోంది . మారుతీ సుజుకీ సియాజ్‌ కారును కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు రూ.45వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చని తెలపింది.మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 ఎంపీవీ కారుపై రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ను అందిస్తున్నారు. మారుతీ సుజుకీ బలెనో కారుపై రూ.20వేల వరకు డిస్కౌంట్‌, రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ.5వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చని ఆ కంపెనీ పేర్కొంది.
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాలో కత్రినా కైఫ్ ...

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాలో కత్రినా కైఫ్ ...

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. బాలీవుడ్ భామనే ఆయన జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత .. ఈ సినిమాలో నాయికలుగా దీపికా పదుకొనె .. ప్రియాంక చోప్రా పేర్లు ప్రధానంగా వినిపించాయి. కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. గతంలో తెలుగులో 'మల్లీశ్వరి'.. 'అల్లరి పిడుగు' సినిమాల తరువాత ఆమె ఇక్కడ చేయలేదు. మళ్లీ తెలుగు సినిమాల్లో చేయడానికి ఆమె కూడా ఆసక్తిని కనబరుస్తోందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.